మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాన్ని ముందుగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అంతకుముందు ఆయన చేసిన ఆచార్య సినిమా భారీ ప్లాప్ కావడంతో ఇప్పుడు ఆయన చేయబోతున్న గాడ్ ఫాదర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. మెగా అభిమానులు కూడా ఈ చిత్రం భారీ విజయం అందుకోవాలని సూచిస్తున్నారు.

తమిళం లో మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు కావడం చిత్రం తప్పకుండా బాగుంటుంది అన్న వార్తలు బయటకి రావడానికి ముఖ్య కారణం. ఆ విధంగా ఈ గాడ్ ఫాదర్ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిసినిమా చేస్తూనే ఇంకొక వైపు మరో సినిమా కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది. ఈ దర్శకుడికి ట్రాక్ రికార్డు బాగా లేకపోవడంతో అభిమానులు కొంత కలవరపడ్డారు కానీ ఈ చిత్రం షూటింగ్ తర్వాత చిరంజీవి నమ్మకాన్ని వ్యక్త పరచడంతో ఈ చిత్రం పై కూడా మంచి ఆసక్తి వస్తుంది. 

ఆ విధంగా ఈ రెండు చిత్రాల తర్వాత చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది. రవితేజ కూడా ఈ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్నాడు. మరి వీరి కలయికలో రాబోతున్న తొలి సినిమా కావడంతో బాబీ చిత్రాన్ని ఏ విధంగా చేసి అగ్ర దర్శకుడుగా ఎదుగుతాడో చూడాలి. దీనిని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఆ విధంగా ఈ ఏడాది తన మొదటి రెండు చిత్రాలను విడుదల చేసి చిరంజీవి వచ్చే ఏడాది మొదటి అర్థం భాగంలో విడుదల చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: