కన్నడ చిత్ర పరిశ్రమ లో హీరోయిన్ గా నిలదొక్కుకుని అక్కడి నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చి అగ్ర కథానాయిక గా ఎదిగింది రష్మిక మందన. చిన్న చిత్రంతో ఆమె తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఎందుకో ఆమెకు అదృష్టం భారీగానే కలిసి వచ్చింది. అలా అతి తక్కువ కాలంలోనే అగ్ర హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అంతటితో ఆగకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కూడా ఈమె అవకాశాల కోసం వెళ్లి అక్కడ కూడా మంచి సినిమాలు చేస్తుంది.

పెద్ద హీరోలు అందరూ కూడా ఇప్పుడు ఈమెతో సినిమా చేయాలని చూసేవారే. ఆ విధంగా సౌత్ లో అన్ని భాషలను కవర్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో కూడా నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు యాడ్స్ ఇంకొక వైపు మోడలింగ్ ఇంకోవైపు సినిమాలు అంటూ ఫుల్ బిజీగా ఉన్నా రష్మిక తెలుగులో మరొక సినిమాను ఒప్పుకోకపోవడం ఆమె అభిమానులను కలవరపరుస్తుంది. కుర్ర హీరోయిన్లు వచ్చి తమ సత్తా చాటుతూ వరుస సినిమాలను అందుకుంటూ పోతుంటే రష్మిక బాలీవుడ్ సినిమాలను మాత్రమే ఒప్పుకోవడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయం అనే చెప్పాలి.

మంచి క్రేజ్ ఉన్న సమయంలో బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కంగుతిన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా తనకు డిమాండ్ ఉన్న టాలీవుడ్ సినిమా పరిశ్రమను వదిలేసి అక్కడికి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప రెండవ భాగం సినిమా తప్ప మరో తెలుగు సినిమా లేదు. వస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు సినిమా అవకాశాలు అందించే హీరో ఎవడో చూడాలి. మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె గ్లామర్ ప్రపంచంలో కూడా ఫామ్ లో ఉంది. ఈ నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఎప్పుడు రష్మిక అవలంబిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: