టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు కొంత టైం లైన్ ఉంటుంది. ఆ సమయంలోనే వారు ఎన్ని సినిమాలు అయినా చేసుకోవా లి లేదంటే తరువాత సినిమా అవకాశాలు రావడం చాలా ఇబ్బందిగా మారిపోతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలి అన్న సామెతను అక్షరాల వాడే హీరోయిన్లు సినిమాల లో తమ డిమాండ్ ఉన్నప్పుడే భారీ పారితోషకాన్ని డిమాండ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. గ్లామర్ ప్రపంచంలో ఎక్కువగా ఈ తరహా హీరోయిన్లకే అవకాశాలు వస్తూ ఉంటాయి అని చెప్పాలి.

ఆ విధంగా మొదటి నుంచి ప్రేక్షకులను తన అందచందాలతో అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ పూజ హెగ్డే ఇప్పుడు మరొకసా రి తన సినిమాల పట్ల ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం ఏర్పడింది. దానికి కారణం ఆమె నటించిన వరుస సినిమాలు ప్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఏ వైపు వెళ్తుందో అన్న ఆలోచన ఆమె అభిమానులు నెలకొంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న త్రివిక్రమ్ సినిమాలో ఆమె హీరోయిన్గా ఎంపిక అయింది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది.

 పూజ కార్యక్రమాలకు కూడా హాజరై పూజా హెగ్డే ఈ చిత్రం పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నానో అన్న విషయాన్ని వెల్లడించింది. మరి ఈ చిత్రం ఆమెకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడితేనే ఆమె మళ్ళీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నాలుగు సినిమాలు చేస్తుంది లేదంటే ఆమె కెరియర్ ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. గ్లామర్ కథానాయకగా టాలీవుడ్ సినిమా పరిశ్రమంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ తప్పకుండా ప్రయత్నిస్తే పెద్ద అవకాశాలు అందుకోవడం ఖాయం అంతే కాదు విజయ్ దేవరకొండ సరసన జన గణ మన సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం పైన కూడా ఆమె గట్టి అంచనాలే పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: