ఇంకా అసలు ఫస్ట్ లుక్ రాలేదు, ప్రభాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడో అసలు కనీసం క్లూ కూడా ఇవ్వలేదు అయినా కూడా ఆది పురుష్ సినిమా అప్పుడే సెన్సేషన్లు మొదలు పెట్టేసింది.రెండు డిజాస్టర్లు బ్యాక్ టు బ్యాక్ పలకరించినా తన మార్కెట్ లో ఇంకా బ్రాండ్ లో ఎలాంటి మార్పు రాలేదని డార్లింగ్ పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు.సీతా రామం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ అతిథిగా వస్తున్నాడన్న వార్త ఏకంగా ఆ సినిమాని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి తీసుకెళ్ళిందంటేనే అభిమానులతో పాటు ఆడియెన్స్ తనను ఎంతగా ఓన్ చేసుకున్నారో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆది పురుష్ సినిమాకు సంబందించిన డిజిటల్ డీల్ ని అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 250 కోట్లకు కొనేసిందని ముంబై మీడియాలో పెద్ద టాకే నడుస్తోంది. ఇప్పటిదాకా ఇది ఏ ఇండియన్ సినిమాకు అసలు సాధ్యపడలేదు.అందులో కూడా రామాయణగాధను ఆధారంగా చేసుకున్న మైథలాజికల్ సబ్జెక్టు మీద ఒక అంతర్జాతీయ ఓటిటి ఇంత మొత్తంలో పెట్టుబడికి ముందు రావడం అనేది నిజంగా గొప్ప విషయం.


ఆది పురుష్ ను తీస్తోంది హిందీ దర్శకుడు ఓం రౌత్ అయినప్పటికీ కూడా ప్రభాస్ హీరో కావడం వల్లే దీనికింత రేంజ్ వచ్చింది. ఇక ఇటీవలే స్ట్రీమ్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం హిందీ వెర్షన్ నుంచే ఊహించని స్థాయిలో అత్యద్భుతమైన రీతిలో గ్లోబల్ రీచ్ సాధించింది. మర్వెల్ లో ఎన్నో సూపర్ హీరోస్ సినిమాలు తీసిన దర్శకులు కూడా రాజమౌళి ప్రతిభకు సాహో అన్నారు. సో వాళ్ళకు మన సత్తా ఏంటో పూర్తిగా అర్థమైపోయింది. పైగా తానాజీని ఓం రౌత్ తీర్చిద్దిద్దిన విధానం చూశాక ఆది పురుష్ సినిమా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. అయితే ఆది పురుష్ పై వస్తున్న ఈ వార్తలు నిజం కావట. అవన్నీ ఫేక్ వార్తలు అని సమాచారం వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: