ఇక టాలీవుడ్ సినీ పరిశ్రమ షూటింగ్స్ అన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు సినిమా ధియేటర్లకు రావడం లేదు కానీ నిర్మాణ వ్యయం అయితే అంతకంతకూ పెరిగిపోతోంది.దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అని భావిస్తూ నిర్మాతలు అందరూ కూడా ప్రస్తుతానికి షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక నిర్మాణ వ్యయం కంట్రోల్లోకి వచ్చేలా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ షూటింగ్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. అయితే ఈ పరిణామాల మీద వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాజాగా ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఏర్పడిన ఈ పరిస్థితికి డైరెక్టర్ రాజమౌళి అలాగే యూట్యూబ్ కారణమని కామెంట్స్ చేశారు. ఓటీటీ వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదన్న నిర్మాతల వాదనను కోటిపారేసిన రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాలకు అసలు శత్రవులు దర్శకుడు రాజమౌళి ఇంకా యూట్యూబ్‌ అని అన్నారు. అసలు ఈ ఓటీటీల వలన ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. అంతేకాక ప్రస్తుతం ప్రేక్షకులు షాట్‌ వీడియోలకు బాగా అలవాటు పడ్డారని, అందుకే ఎక్కువగా యూట్యూబ్‌ని ఫాలో అవుతున్నారని ఆయన అన్నారు.


రాజమౌళి లాంటి దర్శకుడు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్స్ ఇవ్వడం మొదలుపెట్టారని అందుకే ప్రేక్షకులు కూడా రెండు గంటలపాటు తమను అబ్బురపరిచే సినిమా అయితే మాత్రమే ధియేటర్లకు వెళుతున్నారని ఆయన అన్నారు. అలాగే రాజమౌళి ఒక ఆటం బాంబు లాంటివారని ఇంకా అలాగే ఒక భూతం అంటూ ఆయన కామెంట్స్ చేశారు.ఈ ఓటీటీల మీద కూడా ఎక్కువ సమయం వెచ్చించడం లేదు కానీ యూట్యూబ్ మీద అయితే ప్రేక్షకులు ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని రాంగోపాల్ వర్మ అన్నారు.అసలు ఎక్కువ సేపు దేని మీద కూడా వాళ్ళు నిలకడగా ఉండడం లేదని యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటూ వాళ్లకు ఇష్టం వచ్చినవి స్క్రోల్ చేస్తూ వెళుతున్నారని అవన్నీ పక్కనపెట్టి రెండు గంటలపాటు థియేటర్లో కూర్చోవాలి అంటే ఆర్ఆర్ఆర్ లేదా కేజిఎఫ్ లాంటి విజువల్ వండర్స్ మాత్రమే రావాలని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: