హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా క్రేజీ ను సంపాదించుకున్నారు. టాలీవుడ్ నుంచి మొట్టమొదటి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు ఇక ఆ తర్వాత రామ్ చరణ్ ,ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ప్రభాస్ కు పోటీగా వచ్చారు. ఇక ప్రభాస్ క్యాజువల్ అండ్ సింపుల్ గా ఉంటారని చెప్పవచ్చు ఇంట్లో ఉన్న బయటకు వచ్చిన చాలా సింపుల్ గానే కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ కు టీ షర్ట్ ట్రాక్ బాగానే ఉంటుందని చెప్పవచ్చు.


ఎటువంటి హడావుడి లేకుండా తను వచ్చిన పనిని ముగించుకొని వెళుతూ ఉంటారు ఈ విషయంలో ప్రభాస్ స్టార్ హీరోలు అందరి కంటే చాలా భిన్నంగా ఉంటారని చెప్పవచ్చు పెద్దగా హడావిడి లేకుండా ఎంట్రీ ఇచ్చి.. ఎలాంటి వాటిపైన అంతగా శ్రద్ధ చూపకుండా కేవలం షూటింగ్ సమయంలో తప్ప మిగతా టైంలో నో మేకప్ అన్నట్లుగా ఉంటారు. అయితే తాజాగా సీతారాం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా సింపుల్ గా హాజరయ్యారు. అందులో ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

అలా స్టేజి పైన 10 నిమిషాలు మాట్లాడి ముగించి వెళ్ళిపోయారు ప్రభాస్..కాని ప్రభాస్ ధరించిన బ్లూ టి షర్టు మాత్రం నెట్టింటా పెను సంచలనంగా మారుతోంది.. దీని ధర దాదాపుగా 20 వేలకు పైగా ఉన్నట్లు సమాచారం దీన్ని డిజైన్ చేసింది డాల్స్ గబ్బానా ఈ టీ షర్ట్లు చాలా ఖరీదైనవి ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ కు తగ్గ టీ షర్ట్ కాదని మరికొంతమంది సలహాలు ఇస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం ప్రభాస్ ఎలాంటి బ్రాండ్ ధరించిన కూడా చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఫోటో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: