అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ని ప్రారంభించింది .

మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో హన్సిక నటనకు , అంద చందాలకు కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. దానితో ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ అనేక తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా కాలం పాటు మోస్ట్  క్రేజీ హీరోయిన్ గా తన కెరియర్ ను కొనసాగించింది. ప్రస్తుతం హన్సిక ఎక్కువ తమిళ సినిమాలలో నటిస్తుంది. తమిళ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ నటించిన అనేక సినిమాలు మంచి విజయాలు సాధించడంతో హన్సిక కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా హన్సిక కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  నటి హన్సిక మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతుంది అని తమిళ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. సౌత్ ఇండియా కు చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడి కొడుకును హన్సిక పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నట్లు,  త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా ఖరారు చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: