దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన సీతా రామం సినిమా రేపు అనగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కిస్తున్నాడు అని పేరు కలిగిన హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, ఈ మూవీ కూడా ప్రేమ కథ చిత్రం కావడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ ని కూడా మూవీ యూనిట్ ఎక్కువ థియేటర్ లలో విడుదల చేయబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం సినిమా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

నైజాం : 115 , సీడెడ్ : 50 , ఆంధ్ర : 185 . మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 350 థియేటర్ లలో విడుదల కాబోతుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 80 , ఇతర భాషలలో : 180 , ఓవర్ సీస్ లో 250 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 860 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలక పాత్రలో నటించగా భూమిక చావ్లా, తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇతర కీలక పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: