ఈ జనరేషన్లో తమను తాము నిరంతరం లైమ్ లైట్ లో నిలుపుకోవాలి అంటే స్టార్లు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడున్న ఏకైక మార్గం యూనిక్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడమే ఇకపోతే ప్రతిభతో పాటు స్టైల్ కంటెంట్ ప్రచారం చాలా ముఖ్యమని.. యూనిక్ క్వాలిటీస్ లేనిదే హీరోలు లేదా హీరోయిన్లు రాణించడం కష్టం అవుతుందని చాలామందికి తెలుసు అని చెప్పాలి. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఈవెంట్లు,  ప్రీమియర్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా స్టార్లు చాలా సాదాసీదా గానే కనిపించేవారు కానీ కాలక్రమేనా అంతా మారిపోయింది. ఈవెంట్స్ కి  హాజరైనా సరే సెలబ్రిటీలు ఎలాంటి దుస్తులతో దర్శనమిస్తారు.. అనే వాటి కోసమే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే ఇటీవల స్టార్లకు సెలబ్రిటీ స్టైలిస్ట్ కూడా తప్పనిసరిగా అవసరం అవుతున్నారు. ఇక సంఘంలో సెలబ్రిటీ హోదాను కలిగి ఉన్న వారికి తప్పకుండా ఒక స్టైలిస్ట్ అవసరం అవుతున్నారు.


ముఖ్యంగా చెప్పాలంటే కిరాణా దుకాణానికి వెళ్లడం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ , బికినీ,  బీచ్ సెలబ్రేషన్స్ ఇలా ప్రతిదానికి కూడా స్టైలిస్టులు డిజైన్ చేసిన దుస్తులను ధరిస్తూ తమ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి వారిలో ప్రముఖ దక్షిణాది స్టైలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్మాన్ కౌర్ కూడా ఒకరు. ఈమె గొప్ప ప్రతిభావానీ మాత్రమే కాదు ఎంతోమంది స్టార్లను స్టైలిష్ ఐకాన్లుగా తీర్చి దిద్దింది. ముఖ్యంగా అల్లు అర్జున్ మొదలు విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలు అందరికీ ప్రముఖ స్టైలిస్ట్ గా ఈమె పని చేయడం గమనార్హం. ఇక ఈమె వల్లే హీరోలు తమ స్టైలిష్ లుక్ ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులలో స్టైలిష్ ఐకాన్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.గీతా గోవిందం ,అలవైకుంఠపురంలో, ఏవన్ ఎక్స్ప్రెస్, భీష్మ వంటి టాలీవుడ్ సినిమాలకు హార్మాన్ పనిచేశారు. అంతేకాదు ఈమె పాపులర్ బ్రాండ్స్ అయిన లాంగిన్స్, సెలియో , ఫ్లిప్కార్ట్, జొమాటో, సిగ్నేచర్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు కూడా హార్మాన్ పనిచేశారు. అంతేకాదు తన పనితనంపై ఫోర్బ్స్, ఒపీనియన్ ఎక్స్ప్రెస్, జె డబ్ల్యూ ఎస్ వంటి అగ్రశ్రేణి మ్యాగ్ జైన్ లో కూడా ప్రచురితమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: