తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సుహాన్ అంటే చాలామంది ప్రేక్షకులు గుర్తు పట్టరు అని చెప్పాలి.  కానీ కలర్ ఫొటో హీరో సుహాన్ అంటే మాత్రం ప్రతి ప్రేక్షకుడు అయితే గుర్తుపట్టేస్తూ ఉంటాడు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి చిన్నాచితక పాత్రలూ చెప్పుసుకుంటూ వచ్చిన సుహాన్ కమెడియన్ గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత కలర్ ఫోటో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి విజయాన్ని సాధించాడు అని చెప్పాలి. కాగా ఈ సినిమా ఇటీవల జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.


 ఈ క్రమంలోనే కలర్ ఫోటో హీరో సుహాన్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అయితే కలర్ ఫోటో తర్వాత బిజీగా మారిపోయాడు సుహాన్. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ ఆదరగొట్టేస్తున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.


 ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి రాకముందు తాను పడ్డ కష్టాలను కూడా చెప్పాడు.  డిగ్రీ చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తి ఉండడంతో ఇక యూట్యూబ్ ద్వారా టాలెంట్ బయటపెట్టాలని అనుకున్నాను. ఒకానొక సమయంలో ఎలాంటి అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. ఇక ఆ సమయంలో కష్టాలు మరింత ఎక్కువయ్యాయి అంటూ దీనంగా చెప్పేసాడు సుహాన్. చేతిలో రూపాయి కూడా లేకపోవడంతో కొన్నిచోట్ల అప్పు చేసి అవకాశాల కోసం ప్రయత్నించచా.. ఇక నా పరిస్థితిని అర్థం చేసుకుని తన సోదరుడు చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అది మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బు చేతిలో పట్టుకుని మూడు గంటలు ఏడ్చాను. ఇక కలర్ ఫొటో సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఈ సినిమాకు జాతీయ అవార్డు రావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటూ చెప్పుకొచ్చాడు సుహాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: