ఇండస్ట్రీలో ఏ హీరోని కదిలించినా సరే మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చానని తెలుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ ను కూడా మెగాస్టార్ తనకు స్ఫూర్తిగా నిలిచారని తెలియజేస్తోంది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ప్రేమమ్ మలయాళం సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా పరిచయమయ్యింది ఈ కేరళ బ్యూటీ. ఆ తర్వాత అ ఆ సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న మిస్టరీకల్ చిత్రం కార్తికేయ -2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.


ఇక ఈ సినిమాని చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అభిషేక అగర్వాల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం ,బాలీవుడ్ భాషలలో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆగస్టు 13న ఒకేసారి విడుదల కాబోతోంది ఇప్పటివరకు ఈ సినిమా మూడు విడుదల తేదీలు మారిన ఫైనల్ గా ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారు చిత్ర బృందం. అయితే నితిన్ నటించిన మాచర్ల నియోజవర్గం సినిమా ఆగస్టు 12న విడుదల అవుతుంద నేపథ్యంలో కార్తికేయ-2 ని ఒక రోజు ఆలస్యంగా విడుదల చేస్తున్నారు.


ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో చాలా వేగంగా పాల్గొంటుంది. ఈ సందర్భంగా మీడియాతో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని తెలియజేసింది. సినిమా విజువల్స్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయని తెలిపింది. విజువల్ ట్రీట్ ఉన్న ఫిలిం ని మాత్రమే ఎక్కువగా జనాలు చూస్తున్నారు కాబట్టి ఇది అందరికీ నచ్చుతుంది అని తెలిపింది. ఇక మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగగానే చిరంజీవి అని టక్కున చెప్పేసింది. అంతే కాకుండా శర్వానంద్ తో కలిసి శతమానంభవతి సినిమా నటిస్తున్నప్పుడు.. ఈ సినిమా కంటే ముందు ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైంది ఆ రోజు నేను శర్వానంద్ తో కలిసి ఆ సినిమాను చూసామని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: