అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ  మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీ లోనే తన అద్భుతమైన నటనతో , అంద చందాలతో ఈ ముద్దు గుమ్మ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఆ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించిన అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా తన కెరియర్ ని కొనసాగిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దు గుమ్మ రౌడీ బాయ్స్ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కావడం దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ తనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో బాగా నచ్చిన నటుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకు ఎంతో ఇష్టమైన నటుడు మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన మూవీ లు తనకు ఎంతో ఇష్టం అని అనుపమ పరమేశ్వరన్ తాజా ఇంటర్వ్యూలో చెప్పు కొచ్చింది.  అటువంటి టాప్ స్టార్ హీరో మూవీ లో నటించే అవకాశం  వస్తే చాలు వెంటనే చేయడానికి రెడీ అని అనుపమ పరమేశ్వరన్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: