టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరైన క్యాథరిన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యాథరీన్ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలలో నటించి తన నటనతో, అందచందాలతో అలరించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

కొంత కాలం పాటు వరుస క్రేజీ సినిమా అవకాశాలను అంది పుచ్చు కోవడంలో కాస్త స్లో అయినా ఈ ముద్దుగుమ్మ  ప్రస్తుతం మాత్రం వరస అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ని ముందుకు సాగిస్తోంది. కొన్ని రోజుల క్రితమే భళా తందనాన మూవీతో ప్లేట్ ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా మల్లాడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార మూవీ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. 

మూవీ ఈ రోజు అనగా ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ లభించింది. అలాగే నితిన్ హీరోగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో కూడా క్యాథరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీగా కెరీర్ ని గడుపుతున్న క్యాథరీన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా క్యాథరీన్ కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో క్యాథరిన్ పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన హాట్ అందాలు పోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం క్యాథరీన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్యాథరీన్ కి సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు  లవ్ , ఫైర్  సింబల్ ఏమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: