ప్రస్తుతం విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ నేర్చుకోవడానికి ఎంతగానో చెమటోడుస్తుంది. అదేంటి అనుష్క శర్మ క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఏంటి.. ఫాం లో లేని విరాట్ కోహ్లీ కదా ప్రస్తుతం క్రికెట్ ప్రాక్టీస్ చేయాల్సింది అని అనుకుంటున్నారు కదా.. సాధారణంగా నటన లో అంకితభావానికి కేరాఫ్ అడ్రస్ అనుష్క శర్మ. ఏదైనా పాత్రలో నటిస్తోంది అంటే అందులో పరకాయప్రవేశం చేయడానికి ఎంతో కష్ట పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే భారత లెజెండరీ మహిళా ఫేసర్  జులన్ గోస్వామి బయోపిక్లో నటిస్తోంది అనే విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఆమె బయోపిక్లో జులన్ గోస్వామి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు ప్రొఫెషనల్ క్రికెటర్గా మారేందుకు సిద్ధమైంది అనుష్క శర్మ. తనలో క్రికెట్ నైపుణ్యానికి పదును పెట్టేందుకు కఠోర శిక్షణ సిద్ధమైంది అని చెప్పాలి. అయితే జులన్ గోస్వామి బయోపిక్ చెక్ద ఎక్స్ప్రెస్ అనే పేరుతో తెరకెక్కుతుంది. ఇక ఆగస్టు నెలాఖరులో ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. అయితే సెప్టెంబర్ లో  ప్రారంభం కాబోయే క్రికెట్ షూటింగ్ పార్ట్ కోసం 20 రోజుల పాటు అనుష్క ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటుందట.


 ఇకపోతే ఇటీవల కాలంలో మహిళా క్రికెటర్ ల జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలే మహిళల క్రికెట్ జట్టు అగ్రస్థానంలో నిలిపి లెజెండరీ క్రికెటర్ గా ఎదిగిన మిథాలీ రాజ్  జీవిత కథ ఆధారంగా శభాష్ మిథు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తాప్సీ మిథాలీ రాజ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ద్వారా మిథాలీ రాజ్ జీవిత కథను ప్రతి ఒక్కరు తెలుసుకోగలిగారు. ఇప్పుడు అనుష్క శర్మ నటిస్తున్న చెక్ద ఎక్స్ప్రెస్ సినిమా కోసం  కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: