నాచురల్ స్టార్ నాని కొన్ని రోజుల క్రితమే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని దక్కించుకుంది . ఇలా అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకులను అలరించిన నాని తాజాగా దసరా అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ కి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్మూవీ లో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబో తున్నాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల ప్రచార చిత్రాలలో నాని తన ఊర మాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కొంత కాలం నుండి ఈ మూవీ షూటింగ్ గ్యాప్ వచ్చింది.

తిరిగి ఈ మూవీ తదుపరి షెడ్యూల్ వచ్చే సోమవారం నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మూవీ లోని కీలక సభ్యులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పూర్ణ ప్రతి నాయక పాత్రలో కనిపించబో తుంది.  అలాగే పూర్ణ ప్రతి నాయక పాత్ర ఈ మూవీ కి హైలెట్ గానిలవిష్ణునట్లు సమాచారం. ఈ మూవీ కి సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని సుధాకర్ చెరుకురు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: