అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస బాలీవుడ్ మూవీ లలో నటిస్తూ కెరియర్ ఫుల్ జోష్ లో ముందుకు కొనసాగిస్తోంది. అందులో భాగంగా తాజాగా జాన్వి కపూర్ గుడ్ లక్ జెర్రీ అనే మూవీ లో కథానాయికగా నటించింది.

మూవీ నేరుగా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో జూలై 29 వ తేదీన విడుదల అయ్యింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే ఈ మూవీ లోని జాన్వీ కపూర్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జెర్రీ మూవీ తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొలమను కోకిల మూవీ కి అధికారిక రిమేక్. గుడ్ లక్ జెర్రీ మూవీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న జాన్వీ కపూర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా మీడియా సమావేశంలో జాన్వి కపూర్ మాట్లాడుతూ ... ఈ సినిమా  కోసం తనతో పాటు టీమ్ అంతా కూడా చాలా  కష్టపడ్డాం అని, చివరికి ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుండడం చాలా సంతోషంగా ఉంది అని జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది. అలాగే జాన్వికపూర్ నయనతార గురించి మాట్లాడుతూ ... ఈ సినిమాపై నయనతార చాలా పాజిటివ్ గా స్పందించారు అనే  వార్త ను తాను విన్నానన్నారు.ఆ తర్వాత నయనతార  ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశాను, దానికి నయనతార రిప్లై ఇస్తూ, కెరీర్ ప్రారంభంలోనే  నటనకు ప్రాధాన్యత ఉన్న ఇటువంటి పాత్రను ఎంచుకున్నందుకు గర్విస్తున్నాను అని చెప్పినట్లు జాన్వికపూర్ తాజా విలేకరుల సమావేశంలో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: