రాజశేఖర్ జీవిత ల ముద్దుల కూతురు శివాని రాజశేఖర్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తేజ సర్జా హీరోగా తెరకెక్కిన అద్భుతం మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ థియేటర్ లో కాకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. 

మూవీ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని నటనకు శివాని రాజశేఖర్ కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా మొదటి సినిమాలోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితమే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా థియేటర్ లలో కాకుండా నేరుగా సోనీ లివ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఇలా ఇప్పటికే తాను నటించిన సినిమాల ద్వారా ఎంతో మంది ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండు తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. 

అందులో భాగంగా శివాని రాజశేఖర్ అప్పుడప్పుడు తనకు సంబంధించిన  ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా శివాని రాజశేఖర్ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో శివాని రాజశేఖర్ అదిరిపోయే లుక్ లో సారీ ని కట్టుకొని, స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం శివాని రాజశేఖర్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: