నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి కొత్త దర్శకుడు మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా, సంయుక్త మీనన్, క్యాథరీన్ ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

మూవీ నిన్న అనగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.  మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో కూడా విడుదల అయ్యింది. అలా భారీ అంచనాల నడుమ, భారీ థియేటర్ లలో విడుదల అయిన బింబిసార మూవీ మొదటి రోజు మొదటి షో కే అదిరిపోయే పాజిటివ్ టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ మూవీ కి మొదటి రోజు అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు కూడా దక్కాయి. ఇలా బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బింబిసార మూవీ గురించి కే జి ఎఫ్ మూవీ తో దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా వేదికగా బింబిసార మూవీ గురించి ప్రశాంత్ నీల్ స్పందించాడు.  

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన బింబిసార మూవీ విడుదల సందర్భం గా కంగ్రాట్స్ , హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కి, డైరెక్టర్ వశిష్ట్ కి, నిర్మాత హారి తో పాటుగా చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: