మహేష్ బాబు హీరోగా రూపొందబోయే రెండు సినిమాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా త్వరలోనే మొదలు కాబోతుండగా రాజమౌళి దర్శకత్వంలోని సినిమా వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నట్లుగా మహేష్ ఇప్పటికే చెప్పేశాడు. అలా ఇప్పుడు తన దృష్టి మొత్తం పూర్తిగా త్రివిక్రమ్ సినిమా పైనే మహేష్ పెట్టడని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం అనౌన్స్మెంట్ జరిగి చాలా రోజులే అవుతున్న కూడా ఇంకా ఈ ప్రాజెక్టు మొదలు పెట్టకపోవడం మహేష్ అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది

కారణం ఏదైనా కూడా తక్కువ సమయంలో సినిమా చేసి భారీ విజయాన్ని అందుకునే త్రివిక్రమ్ అల వైకుంఠపురం లో సినిమా తరువాత రెండేళ్లు గ్యాప్ ఇచ్చి మరో సినిమాను మొదలు పెట్టకపోవడం ఆయన అభిమానులను కూడా నిరుత్సాహ పరుస్తుంది. అయితే సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జరిగి చాలా రోజులే అవుతున్నా ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకపోవడం అనేది అభిమానులను ఇంకాస్త ఆగ్రహానికి గురిచేస్తుంది. స్క్రిప్ట్ పనులు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి అని చెబుతున్న నేపథ్యంలో ఈ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని చెబుతున్న కూడా ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్ రాకపోవడం వారిలో ఆగ్రహం ఎక్కువ అవ్వడానికి కారణం అవుతుంది.

వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు హిట్ అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు త్వరగా ఈ మూడో చిత్రాన్ని మొదలు పెడతారా అనేది చూడాలి. అయితే ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవ్వడం రాజమౌళి సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేష్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూసే సినిమా రాజమౌళి సినిమానే. త్రివిక్రమ్ సినిమా వేసవిలో విడుదలవుతుంది అని అధికారిక ప్రకటన వచ్చిన కూడా ఇంకా ఈ సినిమా మొదలు పెట్టకపోవడం అప్పుడు ఈ చిత్రం విడుదలవుతుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది. దాంతో రాజమౌళి సినిమా మరికొంత వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిని సీరియస్ గా తీసుకొని వెంటనే త్రివిక్రమ్ సినిమాను మహేష్ మొదలు పెడతారా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: