కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ దిశగా ముందుకు దూసుకుపోతుంది. గత కొన్ని సినిమాలుగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విజయాలను అందుకోలేక పోతున్నారు నిర్మాతలు. దాంతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ కు ఒక భారీ విజయం అవసరం ఎంతైనా ఏర్పడింది. ఎప్పటినుంచో ప్రేక్షకులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందని భావించారు. దానికి తగ్గట్లే ఈ సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది కూడా.

రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలలో కళ్యాణ్ రామ్ నటించిన తీరు అందరినీ ఆకట్టుకోగా ఈ చిత్రం ఇటు దర్శకుడికి అటు హీరోకి ఇద్దరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడింది. తొలి సినిమా అయినా దర్శకుడు ఎంతో అనుభవం గల దర్శకుడుగా ఈ సినిమాను తీసి ప్రేక్షకులను ఆలచించాడు. సంగీతం పరంగా కీరవాణి అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు అయింది. కొన్ని నార్మల్ గా ఉన్న సీన్స్ ను సైతం ఆయన తన సంగీతంతో వేరే స్థాయిలో నిలబెట్టాడు అని చెప్పాలి. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా విజయోత్సవం లో ఉన్న నేపథ్యంలో ఈ చిత్రానికి రెండవ భాగాన్ని కూడా చేయడానికి సిద్ధమవుతోంది.

ఆ విధంగా రెండవ భాగంపై కూడా ఇప్పటినుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇవ్వబోతున్నారు. అయితే మరి కొంతమంది ప్రేక్షకులు మంచి సినిమాకు సీక్వెల్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. అలా క్రేజీ సినిమాలకు వచ్చిన సీక్వెల్స్ ఎక్కువ గా హిట్ అవలేదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన కేథరిన్ థెరిస్సా మరియు సంయుక్త మీనన్ ఇద్దరికీ కూడా ఈ చిత్రం ద్వారా మంచి కితాబు వచ్చిందని చెప్పాలి.  అయితే బింబి సారా రెండో భాగం మొత్తం బింబి సారా తమ్ముడు దేవదత్త మీద ఉండబోతుంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: