ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే చాలు ఆ సినిమా సీక్వెల్ ని ప్లాన్ చేస్తూ ఉంటారు చిత్ర బృందం. ఇక ఇలాంటి సీక్వెల్స్ కు కూడా మంచి క్రేజీ ఉంటుందని చెప్పవచ్చు. అదే తరహాలోని పాత్రలను కూడా కంటిన్యూ చేస్తూ మ్యాజిక్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అయితే తాజాగా కార్తికేయ -2 ఇది మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేయడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.అసలు వివరాల్లోకి వెళితే.. నిఖిల్ హీరోగా నటించిన మిస్టరీ కల్ థ్రిల్లర్ చిత్రం కార్తికేయ -2 ఈ సినిమాని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. 2014లో విడుదలైన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించడం జరిగింది. కార్తికేయ సినిమాలు నిఖిల్ కు జోడిగా కలర్స్ స్వాతి నటించడం జరిగింది. ఈ సినిమాలోని ఈ హీరోయిన్ నటిస్తుందని అందరూ ఊహించారు. అయితే కలర్స్ స్వాతిని మాత్రం చిత్ర బృందం పక్కన పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు.


సీక్వెల్ అంటే ఈ సినిమా మొదటి భాగంలో నటించిన వాళ్లే దాదాపుగా కంటిన్యూ అవుతూ ఉంటారు కానీ ఈ సినిమాలో ఆ పాత్ర కీలకం కావడంతో పలుమార్పులు చేసినట్లుగా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వడం జరిగింది. కలర్స్ స్వాతి వివాహమైన తరువాత సినిమాలకి దూరంగా ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ కారణం చేతనే తనను తీసుకోలేదా అనే అనుమానాలు కూడా అభిమానులలో వ్యక్తం అయ్యాయి. అయితే నిఖిల్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి మెడిసిన్ పూర్తి చేస్తుంది ..ఇక ఆ తరువాత పార్ట్ 2 లో మాత్రం ఆ పాత్రను కంటిన్యూ చేయలేమని తెలియజేస్తూ ఈ సినిమాలో హీరోయిన్ కొత్త మలుపుకు తీసుకు పోయేలా ప్లాన్ చేశామని అందుచేతనే కలర్ స్వాతిని ఈ సినిమాలో తీసుకోలేదని తెలిపారు. అందుచేతనే స్వాతిని కావాలనే పక్కన పెట్టలేదని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: