మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీవని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సునీల్ అంజలి ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించనుండగా, ఎస్ జే సూర్యమూవీ లో కీలక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా రామ్ చరణ్ కెరియర్ పరంగా 15 వ సినిమా కావడంతో, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.  ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ సినిమాను శంకర్ తన గత సినిమాల్లో లాగానే అదిరిపోయే రేంజ్ గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ లోని పాటలు మరియు ఫైట్స్ చిత్రీకరణ విషయంలో శంకర్ అత్యధిక జాగ్రత్తలు తీసుకుంటూ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే దర్శకుడు శంకర్ 'ఆర్ సి 15' సినిమా కంటే ముందే కమల్ హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఇండియన్ 2 అనే మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిలిచిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ అగర్వాల్సినిమా షూటింగ్ లో సెప్టెంబర్ 13 వ తేదీ నుండి పాల్గొననున్నట్లు ప్రకటించింది. దానితో శంకర్ 'ఇండియన్ 2' మూవీ లో బిజీగా ఉండడం వల్ల కొన్ని రోజుల పాటు ఆర్ సి 15 షూటింగ్ కి బ్రేక్ పడనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: