టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ రాజకీయ నేపథ్యం కలిగిన కథతో తెరకెక్కింది. ఈ మూవీ లో నితిన్ సరసన క్యాథరీన్ మరియు కృతి శెట్టి లు హీరోయిన్ లుగా నటించగా, సముద్ర ఖనిమూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. 

ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా, మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి మహతి స్వర సాగర్ సంగీతం అందించిన కొన్ని పాటలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మూవీ లో అంజలి నటించిన స్పెషల్ సాంగ్ అయినటువంటి 'రా రా రెడ్డి ఐ ఆమ్ రెడీ' సాంగ్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా మూవీ యూనిట్ ఇప్పటికే విడుదల చేయగా , ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మాచర్ల నియోజకవర్గం మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఆగస్ట్ 7 వ తేదీన హైదరాబాద్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మొట్ట మొదటి సారి తన కెరియర్ లో నితిన్ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ ఉండడంతో నితిన్ అభిమానులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: