సినిమా పరిశ్రమలో సక్సెస్ అనేది ఎంత కీలకంగా ఉంటుంది అంటే తప్పకుండా సక్సెస్ ఉంటే సదరు హీరో కెరియర్ వేరే స్థాయిలో ఉంటుంది. అలా టాలీవుడ్ లో ఒక హీరోకి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా మంచి సక్సెస్ అనేది రావడం లేదనే చెప్పాలి. కారణం ఏదైనా కూడా ఆయనకు సక్సెస్ రాకపోయినా అవకాశాలు వస్తున్నాయి కానీ ఆ అవకాశాల ద్వారా మంచి సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇదే కొనసాగితే కొన్ని రోజులలోనే ఈ హీరో కనబడకపోవడం జరుగుతుంది అనేది కొంతమంది సినిమా విశ్లేషకుల మాట.

ఇంతకీ ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారా ఆయనే సందీప్ కిషన్. చిన్న చిత్రాల ద్వారా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఓ మోస్తరు హీరోగా రాణిస్తున్నాడు ఇప్పుడు. ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులే అవుతున్న తన సినిమాల ద్వారా సక్సెస్ అందుకుంది పెద్దగా లేదు. ఒకటో రెండో సినిమాలతో మాత్రమే ఆయన హిట్ కొట్టాడు. కానీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న పేరు ఏ సినిమాతో ను తెచ్చుకోలేదని చెప్పాలి. అయినా కూడా మంచి నటుడు అన్న కారణంగా ఆయనకు ఎక్కువ సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చేస్తున్న మైకేల్ సినిమా పైనే అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి. సందీప్ కిషన్ కూడా రెగ్యులర్ సినిమాలను మాత్రమే కాకుండా కొంత వెరైటీ సినిమాలను కూడా చేయాలని ఈ సినిమాను చేస్తున్నడం విశేషం. మాస్ లో మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్న ఈ హీరో హిట్స్ కోసం ఎలాంటి సినిమాలను ఇకపై చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: