టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఆమె చేస్తున్న ఏకైక చిత్రం పుష్ప రెండో భాగం సినిమా. ఇది ఇంకా మొదలు కాకపోవడంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు అక్కడ వరుస సినిమాలను ఒప్పుకునే పనిలో ఉంది. ఇప్పటికే పలు సినిమాల అవకాశాలను అందుకున్న ఆమె ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకున్న విషయం తెలిసిందే

ఒకవైపు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే సమయం దొరికినప్పుడల్లా మరొక బాలీవుడ్ సినిమా అయిన గుడ్ బాయ్ సినిమాలో కూడా ఆమె నటిస్తుందట. షూటింగ్ లో పాల్గొంటుందట. ఆ విధంగా ఈ రెండు సినిమాలను చేస్తూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మళ్ళీ ఇంకొక తెలుగు సినిమా ఒప్పుకోకపోవడం మళ్లీ తెలుగు సినిమాలను చేస్తుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది. ఇది ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తున్న కూడా బాలీవుడ్ లో ఆమె ఎంత బిజీ అవ్వడం వారిని కొంత ఆనందపరుస్తుంది 

గ్లామర్ ఫీల్డ్ లో ఏ విధంగా ఉండాలో మొదట్లోనే తెలుసుకొని వచ్చిన అవకాశాన్నల్లా ఒడిసి పట్టుకుని తనను తాను నిరూపించుకొని ఇప్పుడు ఇంతటి స్థాయి హీరోయిన్ గా ఆమె ఎదిగిందని చెప్పాలి. మరి సౌత్ లో మంచి డిమాండ్ కలిగి ఉన్న ఈ హీరోయిన్ ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేయడం ఆమెకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. పుష్ప రెండవ భాగం సినిమా విడుదలైన తర్వాత ఆమెకు మంచి సినిమా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. రాజమౌళి మహేష్ బాబు సినిమా లో ఆమె హీరోయిన్ గా ఎంపిక అవ్వబోతుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే తప్పకుండా ఈ ముద్దుగుమ్మ కెరియర్ వేరే స్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు. ఇటీవల ఆమె ఓ కీలక పాత్రలో నటించిన సీతారామన్ సినిమా విడుదల అయ్యి ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. హీరోయిన్ కాకపోయినా కూడా ఇంతటి ముఖ్యమైన పాత్రలో నటించడం ఆమె సింప్లీసిటీకి నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: