నిఖిల్ హీరోగా రూపొందిన కార్తికేయ 2 చిత్రం ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. వాస్తవానికి ఏ చిత్రమైన శుక్రవారం విడుదల కావడానికి ఎక్కువగా అవకాశాలు తీసుకుంటుంది. కానీ ఈసారి శనివారం నిఖిల్ తమ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇది నిజంగా ఈ సినిమా యొక్క కలెక్షన్లపై ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. తప్పకుండా వీకెండ్ లో రెండు రోజులలో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు సాధించడం అసాధ్యమైన విషయం.

 ఒకవేళ సినిమా బాగుంటే వచ్చేవారం కూడా రన్ బాగుంటుంది. ఆ విధంగా నిఖిల్ ప్రతి సినిమాకు విడుదల సమయంలో ఇలాంటి సమస్య రావడం ఆయన సినిమాలపై మంచి గట్టి ఎఫెక్ట్నే చూపిస్తుందని చెప్పాలి. ఆయన గత సినిమా అర్జున్ సురవరం చిత్రం యొక్క విడుదల సమయంలోనూ టైటిల్ రగడ పెద్ద ఇష్యూ ని సృష్టించింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చుకోకపోవడానికి కారణం ఇష్యూ అనే చెప్పాలి. ఆ విధంగా నిఖిల్ మంచి కాన్సెప్ట్ తో సినిమా చేసినా కూడా కాంట్రవర్సీ కారణంగా ఆ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

ఇక ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2 సినిమా యొక్క విడుదల విషయంలో ఇంత కాంట్రవర్సీ అవడం కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుందని కొంతమంది సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. కంటెంట్ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిఖిల్ దాంతో విజయం సాధించి మంచి కలెక్షన్లను అందుకోవాలి మరి. ఈ సినిమా తరువాత సుకుమార్ నిర్మాణ సంస్థలో నిఖిల్ 18 పేజెస్ అనే ఒక ప్రేమ కథ సినిమాను చేస్తున్నాడు దీనికి సంబంధించిన విడుదల కూడా త్వరలోనే జరగబోతుంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం. ఈ హీరో తో ఒకేసారి రెండు సినిమాలలో నటించడం ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: