విజయ్ దేవరకొండ కమర్షియల్ స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో చేసిన సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కార్యక్రమాల యొక్క వేగాన్ని పెంచింది. ఆ విధంగా ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ పాటను విడుదల చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఓ మాస్ పాటలో విజయ్ దేవరకొండ వేసిన స్టెప్పులకు ప్రేక్షక లోకం ఎంతగానో ఫిధా అయిపోయింది. ఆ పాటకు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

దాంతో ఇప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్ లో ఆయన ఏ విధంగా కనిపించబోతాడు అన్న ఆసక్తి అందరిలో నెలకొనగా ఈరోజు ఉదయం విడుదలైన పాట ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చిపెడుతుంది. బీచ్ లో సాగే ఈ పాటకు బఘ్చి సంగీతం స్వరపరచగా తెలుగులో భాస్కరభట్ల ఈ చిత్రానికి సాహిత్యం అందిస్తున్నారు. మరి చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు ఓ సినిమాతో రాబోతున్న విజయ్ దేవరకొండ ఏ స్థాయిలో వారిని ఆకట్టుకుంటాడో చూడాలి. 

భారీ అంచనాల నడుమ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రం ఏ విధంగా ఆకట్టుకుంటుందో మరి. ఈ సినిమా తరువాత మరొక ప్రేమ కథ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. సమంత కథానాయకగా నటిస్తున్న ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం అందిస్తున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు. ఆ తరువాత సుకుమార్ దర్శకత్వంతో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. చిన్న సినిమాలతో కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు ఇంతటి స్థాయి కి ఎదగడం నిజంగా ఎలాంటి బాక్గ్రౌండ్ లేకపోవడం నిజంగా ఎంతో గొప్ప విషయం అని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాలు మొదలుపెత్తబోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: