తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ థియేటర్లలో విడుదలై ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. అయితే తొలిరోజు ఈ సినిమా కలెక్షన్లు భారీగానే ఉండవచ్చని తెలుస్తోంది.ఇకపోతే 16 కోట్ల రూపాయల టార్గెట్ తో విడుదలైన ఈ సినిమా సులువుగానే ఆ టార్గెట్ ను బ్రేక్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమా సక్సెస్ కు అసలు కారణం ఎవరనే ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ పేరు సమాధానంగా వినిపిస్తోంది.కాగా కథల విషయంలో తారక్ జడ్జిమెంట్ కు తిరుగుండదని ఈ సినిమా సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయింది. 

అయితే ఈ సినిమా కథ విని ఓకే చేసిన వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఇకపోతే  జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే కళ్యాణ్ రామ్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించారు.ఇదిలావుంటే  మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ చెప్పిన మాటలు అక్షరాలా నిజం కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.అయితే గత కొన్నేళ్లుగా వరుస సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న తారక్ కళ్యాణ్ రామ్ కు కూడా సక్సెస్ దక్కడానికి కారణమయ్యారు.ఇక  భవిష్యత్తులో కూడా కళ్యాణ్ రామ్ కథల విషయంలో, దర్శకుల ఎంపిక విషయంలో తారక్ సహాయం ..

తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాగా  బింబిసార పార్ట్1 సక్సెస్ సాధించడంతో బింబిసార పార్ట్2 కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.ఇదిలావుంటే సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సెలబ్రిటీలు బింబిసార సినిమాకు పాజిటివ్ గా పోస్టులు పెడుతున్నారు.అయితే  ఈ పోస్టులు సైతం సినిమాకు హెల్ప్ అవుతాయనడంలో సందేహం అవసరం లేదు. బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే నందమూరి హీరోలు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ ఉండటం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: