సమంత ‘శాకుంతలం’ పూర్తి చేసి దాదాపు ఒక సంవత్సర కాలం అవుతున్నప్పటికీ ఈమూవీ రిలీజ్ గురించి ఒక క్లారిటీ లేకపోవడంతో ఈసినిమాకు ఏమైందీ అన్న సందేహాలు సమంత అభిమానులకు కలుగుతున్నాయి. చైతన్యతో విడిపోయిన తరువాత సమంత ఒక ఐటమ్ సాంగ్ లో తప్పించి మరెక్కడా కనిపించలేదు.


ఇలా కొంతకాలం గడిస్తే సమంతను తెలుగు ప్రేక్షకులు మర్చిపోయే ప్రమాదం ఉందని ఆమె అభిమానులు భయపడుతున్నారు. దీనికితోడు సమంత ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ ఎక్కువగా ముంబాయిలో ఉంటూ ఉండటంతో ఇక ఆమె భాగ్యనగరంలో ఉండదా అన్న సందేహాలు ఆమె అభిమానులకు వస్తున్న తరుణంలో ఆమె హైదరాబాద్ లో ఉంటాను అంటూ ఒక ఇల్లు కొన్న విషయం తెలిసిందే.


భారీ బడ్జెట్ తో దర్శకుడు గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ మూవీ ఆమె కెరియర్ కు ఎంతో కీలకంగా మారింది. వాస్తవానికి నేటితరం ప్రేక్షకులు ఇలాంటి పురాణాలకు సంబంధించిన సినిమాలను పూర్తిగా చూడటం లేదు. దీనితో ఇలాంటి సినిమాలకు జనం రావాలి అంటే భారీ పబ్లిసిటీ జరగాలి. అయితే దీనికి భిన్నంగా ‘శాకుంతలం’ నిర్మాతలు పూర్తిగా మౌనం వహిస్తున్నారు. దీనికితోడు ‘రుద్రమదేవి’ తరువాత గుణశేఖర్ నుండి మరొక సినిమా రాకపోవడంతో అతడి గురించి కూడ జనం పూర్తిగా మర్చిపోయారు.


ఈ పరిస్థితులలో సమంత అభిమానులు గుణశేఖర్ ను టార్గెట్ చేస్తూ ‘శాకుంతలం’ మర్చిపోయారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ ఆ కామెంట్స్ ను గుణశేఖర్ కు ట్యాగ్ చేస్తున్నారు. ఈ పరిణామాన్ని చూసి ఎలర్ట్ అయిన గుణశేఖర్ ఈమూవీ నిర్మాణం అంతా భారీ గ్రాఫిక్స్ తో కూడుకున్న పరిస్థితులలో ఆలస్యం అవుతోంది అని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఈమూవీ విడుదల ఎప్పుడు అన్నవిషయమై క్లారిటీ ఇవ్వకపోవడంతో సమంత అభిమానులకు అనేక సందేహాలు వస్తున్నాయి. దీనితో ఒక భారీ సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో రాజమౌళిని చూసి నేర్చుకోండి అంటూ కొందరు గుణశేఖర్ కు సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: