ఎప్పుడూ ఇండస్ట్రీలోకి హీరోయిన్లు క్యారెక్టర్  ఆర్టిస్టులు కొత్తవారు వస్తూనే ఉంటారు అని చెబుతూ ఉంటారు. అయితే వీరు మాత్రమే కాదు అటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇటీవలి కాలంలో ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు. మొన్నామధ్య త్రిబుల్ ఆర్ సినిమా లో కొమ్మ ఉయ్యాల ఉయ్యాల అంటూ ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇటీవల విడుదలైన బేబీ సారా సినిమాలో కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది అనే చెప్పాలి. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.


 అయితే బింబిసార  సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ గ్రాఫిక్స్ అన్ని కూడా ప్రేక్షకులను అబ్బుర పరుస్తున్నాయ్. అంతకుమించి కళ్యాణ్రామ్ నట విశ్వరూపం ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేలా చేస్తుంది అనే చెప్పాలి. త్రిగర్తల రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. కొత్త దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్ వహించారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించింది ఒక చైల్డ్ ఆర్టిస్ట్. ఆమె పేరు శ్రీదేవి. శాంభవి అనే పాత్రలో నటించింది. బింబిసార  సినిమాలోని ఫ్లాష్ బ్యాక్  ఎపిసోడ్ తో పాటు ప్రజెంట్ ఎపిసోడ్ లో కూడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కనిపిస్తోంది.


 దీంతో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో అని వెతకడం ప్రారంభించారు ప్రేక్షకులు.. కాగా శ్రీదేవికి ఇది మొదటి సినిమా కాదు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించింది. ఇటీవలే వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ... అంతకుముందు  వచ్చిన మేజర్ సినిమాల్లో కూడా నటించింది. బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ప్రేమ, కల్యాణ వైభోగమే, యమలీల లాంటి సీరియల్స్ లో కూడా నటిస్తోంది. శ్రీదేవి తండ్రి శ్రీహరి గౌడ్ నటుడు మాత్రమే కాదు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా కావడం గమనార్హం. కాగా తండ్రి బ్యాక్ గ్రౌండ్ లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. శాంభవి పాత్రలో శ్రీదేవి నటన చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: