అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . హీరోయిన్ గా కెరీర్ ని మొదలు పెట్టిన మొదటి సినిమా అయన ఉప్పెన తోనే అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా , అదిరిపోయే క్రేజ్ ను కూడా ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరుచుకుంది .

ఇలా మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి తాజాగా నితిన్ హీరోగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూ వీలో మరొక హీరోయిన్ గా క్యాథరిన్ నటించగా , సముద్ర కని ఈ మూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.  ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదిన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా కృతి శెట్టి మీడియాతో ముచ్చటించింది.

అందులో భాగంగా కృతి శెట్టి అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా కృతి శెట్టి కి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి ఏమైనా అవకాశాలు వచ్చాయా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం ఇస్తూ ... బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక అవకాశాలు వచ్చాయి కాక పోతే నాకు పెద్దగా ఆసక్తి లేదు. తెలుగు తో పాటు తమిళం లో మంచి మూవీ లు చేయాలి అనేది నా ఆలోచన . అలాగే ప్రస్తుతం ఇక్కడ నాకు మంచి ఆదరణ లభిస్తోంది. అది చాలు అని కృతి శెట్టి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: