టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న చందు మొండేటి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చందు మొండేటి నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కార్తికేయ మూవీ ద్వారా దర్శకుడిగా చందు మొండేటి కి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చందు మొండేటి 'ప్రేమమ్' మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఈ దర్శకుడు సవ్యసాచి మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. తాజాగా చందు మొండేటి 'కార్తికేయ 2' మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో  నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ మూవీ దర్శకుడు చందు మొండేటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చందు మొండేటి 'సవ్యసాచి' మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చందు మొండేటి మాట్లాడుతూ ... సవ్యసాచి మూవీ కొంత భాగం షూటింగ్ అయిన తరువాత స్క్రిప్ట్ విషయంలో తాను కన్ఫ్యూజ్ అయ్యాననీ, అందు వల్లనే ఆ మూవీ పెద్ద దెబ్బ కొట్టింది అని అన్నాడు. సవ్యసాచి మూవీ ని చూసిన తర్వాత ఆ మూవీ తనకే నచ్చలేదనీ, సవ్యసాచి మూవీ ఫ్లాప్ అవుతుందనే విషయం తనకి ముందుగానే తెలిసిపోయిందని చందు మొండేటి తాజా ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: