టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షలాది అభిమానులు ఆయన సొంతం. ఇక మహేష్ పుట్టినరోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కి అది పెద్ద పండగే. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9 వ తేదీన పోకిరి సినిమా 4 కే వెర్షన్‌లో రీ రిలీజ్ అవుతోన్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ టాలీవుడ్‌లో పెద్ద హాట్‌టాపిక్‌గా మారాయి.అయితే తొలుత కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల రెస్పాన్స్ అనేది అంతకంతకు పెరగడంతో స్క్రీన్స్ సంఖ్య కూడా బాగా పెంచుతూ వచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి, అయినా కూడా ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఇంత కూడా తగ్గలేదు.. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే అన్ని షోస్ కూడా హౌస్ ఫుల్ అయి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.


ఇక ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించబోతున్నారు.ఇండియాతో పాటు ఓవర్‌సీస్‌లో కూడా కలిసి మొత్తం 135 స్క్రీన్స్‌లో పోకిరిని 4 కే వెర్షన్‌లో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా అలాగే అత్యధిక సెంటర్స్ లో రెండోసారి రిలీజ్ అవుతున్న సినిమాగా కూడా పోకిరి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇంకా అంతేకాకుండా ఈ రీ రిలీజ్‌కు మూడు రోజుల ముందే అన్ని షోల టికెట్స్ కూడా స్పీడ్ గా అమ్ముడుపోయాయి. హైదరాబాద్‌లోని ప్రధాన థియేటర్స్ అన్నింటిలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలో పలు నగరాల్లో అడ్వాన్ప్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ద గంటల్లోనే థియేటర్స్ అన్ని కూడా హౌజ్‌పుల్ అయ్యాయి.దీన్ని బట్టి తెలుస్తుంది సూపర్ స్టార్ మహేష్ బాబు స్టామినా ఏంటో.

మరింత సమాచారం తెలుసుకోండి: