మెగా స్టార్ అన్నపదం వినగానే వెంటనే ఎవరికైనా చిరంజీవి గుర్తుకు వస్తాడు. అయితే నందమూరి అభిమానులు అత్యుత్సాహంతో ‘బింబిసార’ మూవీ సూపర్ హిట్ ను ఎంజాయ్ చేస్తూ ‘#megastarkalyanram’ అంటూ దాదాపు 10వేల ట్విట్స్ ఒకేరోజు సోషల్ మీడియాలో హడావిడి చేయడంతో ఈ విషయం మెగా అభిమానులకు విపరీతమైన అసహనం కలిగించినట్లుగా తెలుస్తోంది.


ఈ సంఘటన జరిగి కొన్ని గంటలు అవ్వకుండానే అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ చేసిన ట్విట్స్ మెగా అభిమానులకు మరింత అసహనాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి నందమూరి ఫ్యాన్స్ కు మెగా ఫ్యాన్స్ కు ఎప్పుడు ఎదో ఒక విషయంలో రగడ కొనసాగుతూనే ఉంటుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల సమయంలో కూడ చరణ్ పాత్ర జూనియర్ పాత్ర కంటే హైలెట్ అవ్వడం చాలామంది మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు అన్న వార్తలు కూడ వచ్చాయి.


ఇప్పుడు దీనికి కొనసాగింపుగా అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ ను పొగుడ్తూ చేసిన కామెంట్స్ మెగా అభిమానులకు రుచించడంలేదని టాక్. ‘భీమ్లా నాయక్ విడుదల అయిన తరువాత ఆతారువాత ‘ఆచార్య’ విడుదల అయిన తరువాత పవన్ చిరంజీవి ల గురించి ఒక్క మాట కూడ మాట్లాడని అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ పై ఇంత ప్రేమ ఎందుకు కురిపిస్తున్నాడు అంటూ మెగా అభిమానులు బాధ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఆమధ్య ‘అఖండ’ మూవీ ఫంక్షన్ కు అల్లు అర్జున్ అతిధిగా రావడమే కాకుండా బాలకృష్ణ పై విపరీతమైన ప్రేమను వ్యక్తపరచడం అప్పట్లో మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీనికితోడు ‘ఆహా’ లో బాలయ్య హోస్ట్ చేసిన ‘అన్ ష్టాపబుల్’ అల్లు అర్జున్ అతిధిగా రావడమే కాకుండా అక్కడ కూడ బాలయ్య పై ప్రశంసలు కురిపించాడు. దీనితో బన్నీ వ్యూహాత్మకంగా నందమూరి కాంపౌండ్ కు దగ్గర అవుతున్నాడా అంటూ మెగా అభిమానులలో కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నట్లు టాక్..
మరింత సమాచారం తెలుసుకోండి: