టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించగా , క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ లు ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు.

మూవీ నుండి సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ అభిమానులతో పాటు , మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉండటం వల్ల ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది  బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపు కొని 16.20 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే అద్భుతమైన  బ్లాక్ బస్టర్ టాక్ వరల్డ్ వైడ్ గా దక్కడంతో ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది.

మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 18.29 కోట్ల షేర్ , 30.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో మూడు రోజులకు గాను బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2.09 కోట్ల లాభాలను అందుకొని హిట్ స్టేటస్ ను కూడా అందుకుంది. మరి రాబోయే రోజుల్లో బింబిసార మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: