టాలీవుడ్ యువ హీరోలలో ఒకరైన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించగా , అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది .ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకేక్కడంతో కార్తికేయ 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కార్తికేయ 2 మూవీ ని ఆగస్ట్ 13 వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండటంతో పాటు , ఈ ట్రైలర్ లోనే భారీ గ్రాఫిక్స్ ను కూడా చిత్ర బృందం చూపించింది. దానితో ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 7.57 మిలియన్ వ్యూస్ ని, 174.3 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే కార్తికేయ 2 మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ 2 మూవీ బృందం విడుదల చేసిన ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: