టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నిఖిల్ ఆఖరుగా అర్జున్ సురవరం మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అర్జున్ సురవరం లాంటి మంచి విజయవంతమైన సినిమా తరువాత చాలా కాలం గ్యాప్ తర్వాత నిఖిల్ 'కార్తికేయ 2' మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మూవీ లో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా , చందు మొండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. కార్తికేయ 2 మూవీ చాలా కాలం క్రితం విడుదలై మంచి విజయం అందుకున్న కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది. అలా చాలా కాలం క్రితం విడుదలై మంచి విజయం సాధించిన కార్తికేయ మూవీ కి కార్తికేయ 2 మూవీ సీక్వెల్ గా తెరకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై నిఖిల్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తెలుసుకుందాం.  

కార్తికేయ 2 మూవీ టికెట్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 177 రూపాయలు గాను , సింగిల్ థియేటర్ లలో 147 రూపాయలు గాను ,  తెలంగాణ రాష్ట్రంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 200 రూపాయలు గాను సింగిల్ స్క్రీన్ థియేటర్ లలో 150 రూపాయలు గాను ఉండనునట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: