టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోయిన్ లలో ఒకరు అయిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన మూవీ తో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ జెట్ స్పీడ్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇలా వరుస అవకాశాలతో ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ హీరోగా నటించగా , ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ మూవీ లోని హీరోయిన్ అయిన కృతి శెట్టి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్లాక్ కలర్ లో ఉన్న సారీ ని కట్టుకొని, అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ని ధరించి విచ్చేసింది. దీనితో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఉన్నా అందరి చూపు ఈ ముద్దుగుమ్మ పైనే పడింది. దానితో కృతి శెట్టి ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన కృతి శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: