హీరోయిన్ తాప్సీ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఝుమ్మందినాదం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇక మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. అయితే ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా టాలీవుడ్లో మాత్రం అంతగా అదృష్టం కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. అక్కడ ప్రేక్షకులు మాత్రం ఈ అమ్మడికి బ్రహ్మరథం పట్టారు అని చెప్పాలి. ఒకవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూనే మరోవైపు గ్లామర్ పాత్రల్లో కూడా నటించి కుర్రకారును పిచ్చెక్కించింది అని చెప్పాలి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు అందరికి కూడా తాప్సీ గుర్తుకువస్తుంది అనే రేంజ్ లో తన ప్రభావాన్ని చూపించింది.


 ఇక ఇప్పుడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల శభాష్ మిథు అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. కాగా ఆగస్టు 19 వ తేదీన దోబారా అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్మైంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది తాప్సీ. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మల్టీ టాలెంటెడ్ కరణ్ జోహార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.


 ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కాఫీ విత్ కరణ్ షో కి మీరు వెళ్లలేదా అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా షాకింగ్ ఆన్సర్ చెప్పింది తాప్సీ. నా సెక్స్ లైఫ్ లో కొత్తగా ఏంలేదుగా.. అందుకే ఆ షో నుంచి నాకు ఆహ్వానం రాలేదు.. సెక్స్ పరంగా ఆసక్తికర అంశాలు నా దగ్గర లేవు అంటూ కాఫీ విత్ కరణ్ షో  పరోక్షంగా తనకు నచ్చదు అని చెప్పింది తాప్సీ. ఇటీవల కాలంలో కాఫీ విత్ కరణ్  షో ఇంటర్వ్యూలో చూస్తే ఎక్కువగా సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలే అడుగుతున్నారు. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ నిన్నటికి నిన్న అమీర్ ఖాన్ కరీనా కపూర్ ని కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారూ అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: