తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు ఇంకోవైపు రాజకీయాలతో చాలా బిజీగా ఉంటున్నారు. ఎలక్షన్ల సమయం దగ్గర పడుతూ ఉండడంతో రాబోయే ఎలక్షన్లలో ఎలాగైనా తన సత్తా చాటాలని చాలా పట్టుదలతో విరామం లేకుండా తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మరొకవైపు ఆయన కమిట్ అయిన కొన్ని సినిమాలను పూర్తి చేసే పనిలో కూడా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో విరామం లేకుండా ఉండడంతో గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైనట్లుగా తెలుస్తోంది.


వైరల్ ఫీవర్ బారిన పడిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత ఒక వారంలో కోలుకున్నప్పటికీ ఇంకా నీరసంగానే ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా సమాచారం అందువల్లే ప్రజా సమస్యల దర్భా కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించడం లేదట. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో గత రెండు మూడు వారాలుగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తూ ఉన్నది దానికి తోడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు కారణంగా రైతులు ఎక్కువగా వ్యవసాయ పనులను చేసుకుంటూ ఉన్నారు.


అందువల్ల ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన కూడా జనం అంతగా స్పందించలేం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం కుదుట పడేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరొకవైపు సినిమా షూటింగ్ లు కూడా బంద్ అయిన విషయం తెలిసింది. ఇక పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి అవి చేయడానికి కూడా పవన్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు డైరెక్టర్లు. మరి రాబోయే రోజుల్లో తలపడి లాంటిది పూర్తి చేస్తాడేమో చూడాలి పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: