దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాళిని ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే సినిమా తెరకెక్కిన విషయం మన అందరికి తెలిసిందే. ప్రేమకథలను అద్భుతంగా వెండి తెరపై ఆవిష్కరించడంలో స్పెషలిస్ట్ అయినా హను రాఘవపూడి ఈ మూవీ కి దర్శకత్వం వహించడం, ఈ మూవీ కూడా ప్రేమ కథాంశంతో తెరకేక్కడంతో సినీ ప్రేమికులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అలా మంచి అంచనాల నడుమ సీతా రామం సినిమా ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్సా ఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి.

మొదటి రోజు సీతా రామం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3.05 కోట్ల షేర్ ,  6.00 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రెండవ రోజు సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3.63 కోట్ల షేర్ , 7.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మొదటి రోజు తో పోలిస్తే రెండవ రోజు ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసిన సీతా రామం మూవీ రెండవ రోజు తో పోలిస్తే మూడవ రోజు మరింత ఎక్కువ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. మూడవ రోజు సీతా రామం మూవీ 4.47 కోట్ల షేర్ ,  8.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: