అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రకుల్ ప్రీత్ సింగ్ 2009 లో విడుదల అయిన కన్నడ సినిమా గిల్లి ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అలాగే అద్భుతమైన గుర్తింపు ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్ తన నటనతో, అందచందాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవదాంతో ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస పెట్టి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలను సాధించడంతో ఈ ముద్దు గుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరి గా మారిపోయింది. దాదాపు రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. రకుల్ ప్రీత్ సింగ్ చివరగా తెలుగు లో కొండపొలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు ప్రేక్షకుల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ ...  ఈ రోజు నేను నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తెలుగు ప్రేక్షకులే. నేను తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించాను. అలాగే వారందరితో కూడా నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: