ప్రేమ కథలను అద్భుతంగా వెండితెరపై తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో రష్మిక మందన నటించగా, సుమంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లామూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియదర్శిమూవీ లో ఇతర కొన్ని పాత్రల్లో నటించారు.

మూవీ ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ అద్భుతమైన టాక్ రావడంతో మొదటి రోజు తో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 3 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లను సాధించిందో తెలుసుకుందాం.

నైజాం : 2.54 కోట్లు , సీడెడ్ : 65 లక్షలు , యూ ఏ : 85 లక్షలు , ఈస్ట్ : 56 లక్షలు , వెస్ట్ : 40 లక్షలు , గుంటూర్ : 47 లక్షలు , కృష్ణ : 50 లక్షలు , నెల్లూర్ : 23 లక్షలు . మూడు రోజులకు గాను సీతా రామం మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 6.20 కోట్ల షేర్ , 11.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 60 లక్షలు . ఇతర భాషలలో : 1.55 కోట్లు .ఓవర్ సీస్ లో : 2.80 కోట్లు .మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా సీతా రామం మూవీ 11.15 కోట్ల షేర్ , 22.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: