మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకులను పలు సినిమాలతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన అగ్ర దర్శకుడిగా మంచి గొప్ప పేరు సంపాదించుకున్న శంకర్ తెలుగులో మొట్టమొదటిసారి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ ఫోకస్ పెట్టాడు. గతంలో ఆయన పలుమార్లు తెలుగు సినిమా చేయాలని భావించి విఫలం అయ్యాడు.

 కానీ ఇప్పుడు ఆయన తెలుగు సినిమా చేయవలసిన అవసరం ఏర్పడడంతో ఈ చిత్రం చేయక తప్పలేదు గత రెండు మూడు చిత్రాలుగా ఆయన ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగుండడం లేదు. చేసిన సినిమా విడుదల అయిన తరువాత నష్టాలను తీసుకువస్తుంటే ఇంకొక సినిమా ఆర్థిక కారణాలవల్ల మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుగులో తన సత్తా చాటడానికి సిద్ధమైపోయాడు. ఇప్పటికే చరణ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా మొదలుపెట్టి సగభాగం చిత్రాన్ని పూర్తి చేశాడు. తాజాగా ఆయన గతంలో ఆపేసిన భారతీయుడు సినిమాను మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తుండగా చరణ్ సినిమా సంగతి ఏమవుతుంది అని ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ ఈ చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పోస్ట్ పెట్టడంతో ఈ విధమైన అనుమానాలు అందరిలో ఏర్పడుతున్నాయి మధ్యలోనే శంకర్ ఈ చిత్రాన్ని వదిలేసి వెళుతున్నాడా అన్న అనుమానాలు ఏర్పడు తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ చిత్రం తర్వాత చరణ్ చేయబోయే సినిమాపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.  గతంలో రామ్ చరణ్ గౌతం తిన్ననురి తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి. దానిపై ఎలాంటి అప్డేట్ లేదు. అంతే కాకుండా ప్రశాంత్ నీల్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: