ఒక పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు దర్శకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమా మంచి విజయం సాధిస్తే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అదే సమయంలో ఆ సినిమా ఫ్లాప్ అయితే కూడా సదరు దర్శకులపై ఎన్నో విమర్శలు వస్తాయి. అభిమానుల దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ దర్శకుడుని విమర్శల పాలు చేస్తూనే ఉంటారు. ఇక ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అభిమానులు చేస్తున్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. సినిమా విజయాన్ని అందుకుంటే దర్శకుడుని ఆకాశాన్ని ఎత్తేసిన వారే సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ ను దారుణంగా రూల్స్ చేస్తూ ఉంటారు.

అలా ప్రభాస్ హీరోగా నటించిన గత సినిమా రాధే శ్యామ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని మూట కట్టుకుంది. ఈ చిత్రం యొక్క దర్శకుడు పై ప్రభాస్ అభిమానులు ఎన్నో ట్రోల్స్ చేశారు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ సినిమా విడుదలయ్యి నాలుగైదు నెలలు దాటుతున్న కూడా ఇంకా ఆయనను చేస్తూనే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రభాస్ గత రెండు సినిమాలు గా ఏమాత్రం విజయాన్ని అందుకోకపోవడం బాహుబలి తరువాత పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుకోకపోవడం వంటివి జరుగుతున్న క్రమంలో రాధేశ్యం చిత్రం భారీ విజయం అందుకోవాల్సిన అవసరం ఉంది.

 అలా ఎన్నో అంచనాలను పెట్టుకున్న ఈ సినిమా ఒక్కసారిగా నిరాశపరిచేసరికి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే సందు దొరికితే ఈ దర్శకుడిని చేయడం చేస్తున్నారు మరి ఇందులో ప్రభాస్కు ఏం సంబంధం లేనట్లుగా అభిమానులు కేవలం దర్శకుడిని మాత్రమే ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇక్కడి అసలు విషయం. తాజాగా సీతారామం సినిమా కి గెస్ట్ గా వచ్చిన ప్రభాస్సినిమా ను ఎంతో బాగా పొగడడం తో అలాంటి ప్రేమ కథ ఎందుకు చెయ్యలేదు అని అయన పై విమర్శలు కురుపిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: