దర్శకుడు బుచ్చిబాబు సానా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో క్రేజీ దర్శకుడుగా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వ పర్యవేక్షణలో బుచ్చిబాబు రూపొందించిన ఉప్పెన సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్క అంశంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పాయింట్ తీసుకొని ఆ చిత్రాన్ని ఎంత పెద్ద విజయం అందుకునేలా చేసిన బుచ్చిబాబు ఇప్పుడు తన రెండవ సినిమా యొక్క పనులలో నిమగ్నమై ఉన్నాడు.

ఎన్టీఆర్ తో ఆయన తన తదుపరి సినిమా చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేయబోతున్నాడు.  త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అయితే ఎన్టీఆర్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను మొదలు పెట్ట లేకపోతున్నాడు. అయితే బుచ్చిబాబు కేవలం ఎన్టీఆర్ కోసం మాత్రమే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇటీవల ఆయన కోసం ఓ అద్భుతమైన కథను ఆయన రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. తొందర్లోనే చరణ్ కు వినిపించి దానిని కూడా ఓకే చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నాడు. మరి ఇంతటి టాలెంటెడ్ డైరెక్టర్ తన రెండవ సినిమాను ఈ ఇద్దరిలో ఎవరితో చేస్తాడు అన్నది తేడాల్సి ఉంది. రచయితగా ఎలాంటి సంభాషణలు రాయగలడో అందరికీ తెలిసిందే. దర్శకత్వం యొక్క ప్రతిభ పరంగా కూడా ఆయన మంచి టాలెంటెడ్ పర్సన్. ఈ నేపథ్యంలో పెద్ద హీరోలను ఏవిధంగా హ్యాండిల్ చేసి ఆ సినిమాను హిట్ చేసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎలాగో ఈ దర్శకుడికి బ్యాకప్ సుకుమార్ ఉండడం ప్లస్ పాయింట్ అవుతుంది. త్వరలోనే ఈ దర్శకుడు చేయబోయే రెండవ సినిమా యొక్క పూర్తి వివరాలు తెలియనున్నాయి. రామ్ చరణ్ కూడా ఈ దర్శకుడితో సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచుస్తున్నాడని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: