నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే మూవీలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీవలో సంయుక్త మీనన్ , క్యాథరీన్ హీరోయిన్ గా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే మల్లాడి వశిష్ట్ దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు.

మూవీ విడుదలకు ముందే ఈ మూవీ నుండి చిత్ర  బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ  తేదీన బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కె ఈ మూవీ అద్భుతమైన టాక్ ని బాక్సాఫీస్ దగ్గర తెచ్చుకుంది.

దానితో బింబిసార మూవీ అద్భుతమైన ఓపెనింగ్స్ ను కూడా సాధించింది. అలాగే 3 రోజుల బాక్సాపీస్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన రేంజ్ కలెక్షన్లను అందుకుంటున్ బింబిసార మూవీ గురించి మాస్ మహారాజ రవితేజ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. బింబిసార మూవీ గురించి సోషల్ మీడియా వేదికగా రవితేజ స్పందిస్తూ ... బింబిసార మూవీ మాంచి విజయం సాధించినందుకు మూవీ టీమ్ కి కంగ్రాట్స్. కొత్త దర్శలుడు మల్లాడి వశిష్ట్ మూవీని చాలా బాగా తీశారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చాలా బ్రిలియంట్ గా చేసాడు. ఎం ఎం కీరవాణి ,  చోటా కె నాయుడు ను అభినందించారు. హీరోయిన్స్ కేథరిన్ థెరిస్సా, సంయుక్త మీనన్ లతో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కి రవితేజ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: