పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా తెరకెక్కిన జల్సా సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇలియానా , పార్వతీ మెల్టన్ హీరోయిన్ లుగా , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన జల్సా సినిమా 2 ఏప్రిల్ 2008 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది .

మూవీ ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించగా , దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు . దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయం లో కీలక పాత్ర ను పోషించింది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న జల్సా సినిమా 4కే వర్షన్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు . ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే వారి కోరిక నెరవేరేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జల్సా మూవీ 4కే వర్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం జల్సా మూవీ  రీమాస్టర్డ్ వెర్షన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన ఇతర పనులపై గీతా ఆర్ట్స్ బృందం వర్క్ చేస్తున్నట్లు సమాచారం.  ఇక మరి కొన్ని రోజుల్లోనే జల్సా మూవీ 4కే వర్షన్ కి సంబంధించిన విడుదల తేదీ రానున్నట్లు తెలుస్తోంది. జల్సా మూవీ 4 కే వర్షన్ మూవీ విడుదల తేది కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: