చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. అంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఏ విధంగా కళ్యాణ్ రామ్ సక్సెస్ బాట పడతాడు అన్న ఆసక్తి అందరికీ ఏర్పడింది. అలా ఇటీవల విడుదల చేసిన బింబి సారా చిత్రం భారీ విజయన్న అందుకుంది. రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రలో నటించి ఈ హీరో ఇంతటి పెద్ద విజయాన్ని అందుకోవడం టాలీవుడ్ సినిమా పరిశ్రమకు కూడా ఊపిరినిచ్చింది అని చెప్పాలి.

గత కొన్ని సినిమాలుగా వచ్చిన సినిమా వచ్చినట్లే ప్రేక్షకులను నిరాశ పరుస్తుంటే మేకర్స్ అందరు కూడా ఎంతగానో కలవర పడ్డారు. ఏ సినిమా టాలీవుడ్ కు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందో అని అందరూ ఆరాటపడ్డారు. అలా అందరి ఆశలను తీరుస్తూ బింబి సారా చిత్రం సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా హిట్ అయిన కూడా కొంతమంది ఈ సినిమా బాగుండడం లేదు అనే టాక్ కు తీసుకురావడం కొంతమందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నందమూరి అభిమానులను ఎంతగానో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 

మరి దీని వెనక ఎవరి హస్తము ఉందో తెలియదు కానీ ఈ విధమైన ప్రచారం పెద్ద మైనస్ గా మారుతుంది అని చెప్పవచ్చు. ఇప్ప టికే సాధారణ ప్రేక్షకులకు సైతం ఈ చిత్రం సూపర్ హిట్ అయింది అన్న టాక్ వినిపిస్తుంది. ఆ విధంగా ఈ చిత్రాన్ని వెనక్కి లాగుతున్న ప్రబుద్ధులు ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా ఒక హీరో సినిమా విజయాన్ని అందుకుంటే మరొక హీరో అభిమానులు దాన్ని వెనక్కి లాగడం జరుగుతూ ఉండడం మనం చూశాం. మరి ఈ నందమూరి హీరో సక్సెస్ ను ఓర్వలేని హీరోలు ఎవరో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: