అక్కినేని హీరోలు తాజాగా మరొక క్రేజీ మల్టీస్టారర్ మూవీకి సిద్ధమయ్యారు ఒకే ఫ్రేమ్లో నాగార్జున అఖిల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ని మెగాస్టార్ చిరంజీవి ఫైనల్ చేసినట్లుగా సమాచారం. నాగార్జున అఖిల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని తమిళనాడు డైరెక్టర్ మోహన్ రాజా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో స్టోరీని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఇద్దరు హీరోలకు కథను కూడా వినిపించి ఒప్పించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ కథని లాక్ చేయడంలో చిరంజీవి కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తున్నది.


ఈ కథ ముందు చిరంజీవి వద్దకు వెళ్లగా అప్పుడే చిరంజీవి ఇలాంటి కథకి నాగార్జున అఖిల్ అయితే కరెక్టుగా సరిపోతారని చెప్పారట ఆ వెంటనే చిరంజీవి నాగార్జునకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పారట. ఇక తర్వాత మెహన్ రాజా ఆ ఇద్దరు హీరోలకు కథ వినిపించడం జరిగింది వాళ్లకు కూడా కథ నచ్చడంతో ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించేందుకు ముందుకొచ్చారు బడ్జెట్ పరంగా స్క్రిప్ట్ హై రేంజ్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా నే కొనిదెల ప్రొడక్షన్ బ్యానర్ కూడా భాగస్వామ్యం అయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నది.


స్టోరీ లైన్ అప్ మాత్రం చాలా ఇన్నోవేటివ్ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందుచేతనే చిరంజీవి నాగార్జునకు అంత లైక్ ఇచ్చాడని కారణం కూడా తెలుస్తున్నది. మరి ఇందులో వాస్తవాలు ఏమిటన్నది మాత్రం అధికారికంగా ప్రకటిస్తే కానీ క్లారిటీ రాదని చెప్పవచ్చు ఇప్పటికే నాగార్జున అఖిల్, మనం, సిసింద్రీ వంటి సినిమాలలో నటించడం జరిగింది. కానీ అది చాలా పరిమితంగానే నటించారు కానీ ఈసారి ఏకంగా మల్టీ స్టార్ సినిమా గాని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి మెగా కుటుంబానికి మంచి సన్నిహిత్యం ఉన్న కారణం వల్ల చిరంజీవి ఇలా చెప్పాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: